గురువు స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా.. విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే గురువు స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో న్యాయపరమైన సమస్యలను అధిగమించి మెగా డీఎస్సీ నిర్వహించినట్లు తెలిపారు. గురువులే విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దుతారు తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న చంద్రబాబు.. భక్తవత్సలం...