7 ఏళ్ల చిన్నారి కూడా ప్రతి ప్రశ్నకు ఏఐనే అంటోంది.. తండ్రి ఆందోళనకు కారణమిదే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. పిల్లలపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ కూడా మొదలైంది. గురుగ్రామ్‌కు చెందిన కరణ్ ధుండియా తన ఏడేళ్ల కుమార్తెకు సంబంధించిన ఓ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ అంశంపై చర్చ జరుగుతోంది. తన కుమార్తెకు ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకపోతే ముందుగా తల్లిదండ్రులను అడగడం లేదా వారితో కలిసి సమాధానం వెతకడం కంటే.. నేరుగా చాట్‌జీపీటీని అడగాలని సూచిస్తోందని కరణ్ తెలిపారు. పిల్లలకు ఏఐపై పెరుగుతున్న ఆధారపడటం గురించి ఇదే తనకు ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. తల్లిదండ్రులతో కలిసి తెలుసుకోవడంలోనే అసలైన నేర్చుకోవడం చాట్‌జీపీటీ వద్ద మనుషుల కంటే ఎక్కువ సమాచారాన్ని త్వరగా పొందే...