అక్టోబర్ 10 నుంచి ISL ఫుట్‌బాల్ జాతర.. 13 జట్లు, 163 మ్యాచ్‌లు

భారత ఫుట్‌బాల్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఇండియన్ సూపర్ లీగ్ (ISL) 2026-27 సీజన్‌కు సంబంధించిన ప్రారంభ తేదీలు ఖరారయ్యాయి. అక్టోబర్ 10న మొదలయ్యే ఈ సీజన్ 2027 మే వరకు కొనసాగనుంది. దాదాపు ఎనిమిది నెలల పాటు సాగే టోర్నీలో 13 జట్లు మొత్తం 163 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. హోమ్‌-అవే ఫార్మాట్‌లో పోటీ కొత్త సీజన్‌ను సాంప్రదాయ హోమ్‌-అవే విధానంలో నిర్వహించనున్నారు. లీగ్ దశ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు షీల్డ్ విజేతగా నిలవడంతో పాటు ఆసియా స్థాయి టోర్నీల్లో పాల్గొనే అవకాశం పొందుతుంది. టాప్-6లో నిలిచిన జట్లు ISL కప్ కోసం ప్లేఆఫ్స్‌లో పోటీపడతాయి. క్లబ్‌ల చేతుల్లో కీలక నిర్ణయాలు...