మహిళల ఆసియా కప్.. పాక్ను చిత్తు చేసిన భారత్
మహిళల ఆసియా కప్ 2026లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. దుబాయ్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు విజృంభించడంతో పాక్ జట్టు 55 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ.. భారత బౌలర్ల ముందు ఆ జట్టు బ్యాటర్లు నిలబడలేకపోయారు. శ్రీ చరణి, ప్రేమ రావత్ చెరో మూడు వికెట్లతో సత్తా చాటగా.. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. దీంతో పాక్ 18.1 ఓవర్లలోనే 55 పరుగులకు ఆలౌటైంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా వరుసగా మూడు...