మంత్రివర్గంలోకి మహేశ్ గౌడ్.. కొత్త పీసీసీ చీఫ్‌పై ఉత్కంఠ
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులను భర్తీ చేసే అవకాశాలపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందన్న చర్చ బలంగా సాగుతోంది. ఆయన పీసీసీ అధ్యక్ష పదవీకాలం ఈ నెల 15తో ముగియనుండటంతో, అనంతరం పార్టీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని నియమించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. కొత్త పీసీసీ చీఫ్ రేసులో ఇద్దరి పేర్లు మహేశ్ గౌడ్ స్థానంలో కొత్త...