పాక్‌పై మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ ప్రపంచ రికార్డు.. సిక్సర్‌తో విజయానికి ముగింపు

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన మహిళల ఆసియా కప్ మ్యాచ్‌లో ఆమె 150 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. పురుషులు, మహిళల క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని ఈ ఘనతను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయంతో నమోదు చేయడం విశేషం. శనివారం దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు భారత స్పిన్నర్లను ఎదుర్కోలేక 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్‌కు ఇదే అత్యల్ప...