బీఆర్ఎస్ నేతలు ముందు పదేళ్ల పాలనపై లెక్క చెప్పాలి: మూడ్ మోహన్ నాయక్

తుంగతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు ముందుగా తమ పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని తుంగతుర్తి నియోజకవర్గ టీపీసీసీ సోషల్ మీడియా మూడ్ మోహన్ నాయక్ డిమాండ్ చేశారు. దళితుడిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని చేస్తామన్న హామీ, భూమిలేని దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి హామీల పరిస్థితి ఏమైందని ఆయన ప్రశ్నించారు. పేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య వంటి హామీలు ఎంతవరకు అమలయ్యాయో బీఆర్ఎస్ నేతలు వివరించాలని అన్నారు. దళిత బంధు పథకం అందరికీ చేరిందా? ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో...