బీఆర్ఎస్ నేతలకు తుంగతుర్తి నియోజకవర్గ టీపీసీసీ సోషల్ మీడియా మూడ్ మోహన్ నాయక్ సూటి ప్రశ్నలు…?!
కాంగ్రెస్ ప్రజాపాలనపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులారా… ముందుగా మీ పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలకు లెక్క చెప్పండి! 👉 దళితుడిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీ ఏమైంది? 👉 భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు… ఎంతమందికి ఇచ్చారు? 👉 ఇంటికో ఉద్యోగం అన్న మాట ఏమైంది? 👉 నెలకు ₹3,016 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు… ఎంతమంది నిరుద్యోగులకు ఇచ్చారు? 👉 పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు… దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంతమందికి అందించారు? 👉 కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు… తెలంగాణలో ఎక్కడ అమలు చేశారు? 👉 దళిత బంధు ప్రతి...