యూపీఎస్సీ సీజీఎస్ఈ-2027 నోటిఫికేషన్ విడుదల.. 127 పోస్టులు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్ (CGSE)-2027కు నోటిఫికేషన్ విడుదల చేసింది. భూగర్భ శాస్త్రం, జియోఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 127 ఖాళీలు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో 111 పోస్టులు ఉన్నాయి. వీటిలో జియాలజిస్ట్, కెమిస్ట్, అసిస్టెంట్ జియాలజిస్ట్, అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్, అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టులు ఉన్నాయి. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో 16 పోస్టులు భర్తీ చేయనున్నారు. సైంటిస్ట్-బి, అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్, అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్ తదితర ఉద్యోగాలు ఇందులో...