స్వాతంత్ర ఫలాలు బిసి, ఎస్సీ,ఎస్టీల దరి చేరడం లేదు
బీసీ నేత ధనుంజయ నాయుడు ఆవేదన అనంతగిరి సెప్టెంబర్ 06 : స్వాతంత్ర వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్న నేటికీ స్వాతంత్ర ఫలాలు బీసీ, ఎస్సీ,ఎస్టీల దరి చేరడం లేదని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో బీసీ ముఖ్య నాయకులతో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ...... ఒకపక్క దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని పాలకులు ఎన్ని కల్ల బొల్లి మాటలు చెప్పినా ఈనాటికి రేషన్ బియ్యం కోసం జనం క్యూలో నిలబడుతున్నారని సరైన వైద్యం అందక అనేకమంది హఠాన్మరణం చెందుతున్నారని నాణ్యమైన విద్య అందక...