పల్లెల విధ్వంసం – పడకేసిన పారిశుధ్యం!
కాంగ్రెస్ 1000 రోజుల పాలన అంతా మోసమే.. ముఖ్యమంత్రి తీరు మారకపోతే అడుగడుగునా అడ్డుకుంటాం! అనంతగిరి సెప్టెంబర్ 06: అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో “పల్లెల విధ్వంసం – పడకేసిన పారిశుధ్యం” అనే అంశంపై గ్రామస్థాయిలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై, ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో ఏదో ఉద్ధరిస్తామని చెప్పి మాయమాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారు. తన కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీ...