సీపీఎం పోరాట ఫలితమే ఎర్రబాడు దొరల ఆధీనంలో ఉన్న భూములకు పట్టాలు

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు నూతనకల్: ఎర్రబాడు ప్రాంతంలో దొరల ఆధీనంలో ఉన్న భూములను పేదలకు పంచాలని సీపీఎం ఆధ్వర్యంలో సంవత్సరాలుగా సాగించిన భూపోరాటాల ఫలితంగానే నేడు పేద రైతులకు భూమి పట్టాలు అందుతున్నాయని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు. నూతనకల్‌లోని తొట్ల మల్సూర్ భవన్‌లో నూతనకల్, మద్దిరాల మండలాల ఉమ్మడి మండల కమిటీ సమావేశం కల్లేపల్లి భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా యాదగిరిరావు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో శిల్పకుంట్ల, ఎర్రబాడు, మిర్యాల, పొలుమల్ల గ్రామాలతో పాటు మరో 14 గ్రామాలలో పేదల భూమి హక్కుల కోసం సీపీఎం అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు....