వేడుకగా వురిమళ్ళ ఫౌండేషన్ పురస్కారాల పండుగ
ప్రముఖ కవి రచయిత చిమ్మపూడి శ్రీరామ మూర్తికి భోగోజు సముద్రమ్మ -పురుషోత్తం స్మారక పురస్కార ప్రదానం -కథల కవితల సంకలనం ఆవిష్కరణ ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్, 6: వురిమళ్ళ ఫౌండేషన్ 8వ వార్షికోత్సవ సందర్బంగా ఖమ్మంలోని మంచికంటి మీటింగ్ హాల్లో ఆదివారం నిర్వహించిన పురస్కారాల పండుగ వైభవంగా వేడుకగా జరిగింది. తొలుత భోగోజు సముద్రమ్మ-పురుషోత్తం, వురిమళ్ళ శ్రీరాములు, పద్మజ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దాసరోజు శ్రీనివాస్ అధ్యక్షతన కథలు, కవితల పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా భోగోజు సముద్రమ్మ-పురుషోత్తం స్మారక పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త చిమ్మపూడి శ్రీరావుమూర్తికి వురిమళ్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు వురిమళ్ల సునంద, భోగోజు ఉపేందర్రావు అందచేశారు. అనంతరం కథల...