ఎంపీ వద్దిరాజు కుటుంబ సభ్యులు తమ వ్యవసాయ క్షేత్రంలో ఉప్పలమ్మ పండుగ చేశారు
ఖమ్మం ప్రతినిధి : బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలోని వ్యవసాయ క్షేత్రంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉప్పలమ్మ పండుగ చేశారు.ఈ పండుగకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్,మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ,సంఘం ఖమ్మం జిల్లా గౌరవాధ్యక్షులు కొత్త సీతారాములు,ఆకుతోట ఆదినారాయణ,వేం రాంచంద్రారెడ్డి తదితరులు ఉప్పలమ్మను దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టారు.వద్దిరాజు కమలమ్మ,వద్దిరాజు కిషన్ -శశిరేఖ,వద్దిరాజు దేవేందర్ -ఇందిర,వద్దిరాజు రవిచంద్ర -విజయలక్మీ,వద్దిరాజు మోహన్-వాసవి, వద్దిరాజు వెంకటేశ్వర్లు-పద్మ, వద్దిరాజు వెంకటేశ్వర్లు-ఉమా మహేశ్వరి తదితరులు ఉప్పలమ్మకు కొబ్బరికాయలు కొట్టి పూజలో పాల్గొన్నారు.అలాగే, సంగిశెట్టి లక్ష్మీనారాయణ, సంగిశెట్టి శంకర్, సంగిశెట్టి ప్రభాకర్,...