ఐఐటీ హైదరాబాద్‌లో అకౌంటెంట్ ఉద్యోగాలు.. రూ.53 వేల వరకు జీతం

హైదరాబాద్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT Hyderabad)లో అకౌంటెంట్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు వివరాలు పోస్టు: అకౌంటెంట్ విద్యార్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. టాలీ, ERP, MS Office, ముఖ్యంగా Excelపై మంచి అవగాహన అవసరం. అకౌంటింగ్, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, బడ్జెట్ నిర్వహణ, యుటిలైజేషన్ సర్టిఫికెట్ల తయారీ వంటి పనుల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. GST, TDS, ఆదాయపు పన్ను నిబంధనలు, ఆడిట్ ప్రక్రియలపై పరిజ్ఞానం ఉండటం అవసరం. వయోపరిమితి అభ్యర్థుల గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు....