కాంగ్రెస్‌లో క్రమశిక్షణ చర్యలు.. 18 మంది నేతలకు షోకాజ్ నోటీసులు

తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీ అంతర్గత వ్యవహారాలపై క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది. పార్టీ సమావేశాల్లో వివాదాలకు కారణమైనట్లు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం 18 మంది నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గాంధీభవన్‌లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నోటీసులు అందుకున్న నేతలు వారం రోజుల్లోగా తమ వివరణ ఇవ్వాలని కమిటీ సూచించింది. ఆదిలాబాద్, గజ్వేల్, సిరిసిల్ల, కరీంనగర్ ప్రాంతాల్లో చోటుచేసుకున్న పార్టీ అంతర్గత వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులపై కమిటీ విచారణ చేపట్టింది. నోటీసులు అందుకున్న వారిలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీ...