సర్పంచ్‌లకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్.. త్వరలో కొత్త బిల్లు

హైదరాబాద్: తెలంగాణలోని సర్పంచ్‌లకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. గ్రామాభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు నేరుగా సర్పంచ్‌లకు అందేలా కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. గచ్చిబౌలిలో నిర్వహించిన సర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. త్వరలోనే అసెంబ్లీలో కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. గతంలో ఉప సర్పంచ్‌లకు ఇచ్చిన చెక్ పవర్ విధానం కారణంగా కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సర్పంచ్‌లు రాజకీయ, ఇతర ఒత్తిళ్లకు వెనుకాడకుండా ప్రజలకు సేవ...