చట్టసభల సాక్షిగా ప్రజాస్వామ్య ఖూనీ
కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై కోదాడ గాంధీ చౌక్ వద్ద మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణుల మెరుపు రాస్తారోకో! సూర్యాపేట సెప్టెంబర్ 07: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నఅప్రజాస్వామిక, నిరంకుశ పోకడలపై,ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ‘కౌరవ సభ’గా మార్చిందని ధ్వజమెత్తుతూ, కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణ కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను సభకు రాకుండా పోలీసు బలగాలతో...