వంకర కాళ్లతో పుంగనూరు పెయ్య దూడ జననం

శస్త్రచికిత్స లేకుండానే కాళ్లు సరిచేసిన పశువైద్యులు సూర్యాపేట, సెప్టెంబర్ 06: అరుదైన పుంగనూరు జాతికి చెందిన పెయ్య దూడ వంకర కాళ్లతో జన్మించిన ఘటన కోదాడ పట్టణంలో చోటుచేసుకుంది. ఓ రైతు ప్రేమగా పెంచుకుంటున్న పుంగనూరు ఆవుకు జన్మించిన దూడ ముందు కాళ్లు వంకరగా ఉండటంతో నిలబడలేకపోయింది. దీంతో యజమాని దూడను కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకెళ్లారు.దూడను పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య.. తల్లి గర్భంలో ఉన్న సమయంలో ఎదుగుదల లోపం కారణంగా కాలి గిట్టల నుంచి మోకాళ్ల వరకు ఉన్న నరాలు సాగకుండా బిగుసుకు పోవడంతో వంకర కాళ్లతో జన్మించినట్లు గుర్తించారు. అత్యవసర చికిత్సలో భాగంగా బిగుసుకుపోయిన నరాలను సాగదీసి, వెదురు...