ఓలా, ఉబర్ తరహాలో ఆటోలకు ప్రభుత్వ యాప్..!

ఆటో డ్రైవర్లకు మరింత ప్రయోజనం కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సేవలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడంపై పరిశీలన జరుగుతోంది.ఈ ప్రతిపాదనపై ఇప్పటికే ఐటీ శాఖ మంత్రికి లేఖ రాసినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆటో డ్రైవర్లు, ప్రయాణికులకు ఉపయోగపడేలా యాప్‌ను రూపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.మరోవైపు టీజీఎస్‌ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టి ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ విధానాన్ని తీసుకురానున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి చర్చ చేయడం లేదన్నారు.ఆటో...