విదేశాల్లో చదివిన యువతకు యాక్సిస్ బ్యాంక్ గుడ్‌న్యూస్.. ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్!

విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసి, అంతర్జాతీయ స్థాయిలో పని అనుభవం సంపాదించిన భారతీయ యువతకు యాక్సిస్ బ్యాంక్ ప్రత్యేక ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది. ‘అరైజ్ హోమ్‌కమింగ్’ పేరుతో చేపట్టిన ఈ రిక్రూట్‌మెంట్ కార్యక్రమం ద్వారా భారత్‌కు తిరిగి వచ్చి కెరీర్ కొనసాగించాలనుకునే ప్రతిభావంతులను ఎంపిక చేయనున్నారు. అర్హతలు ఇవే.. విదేశీ యూనివర్సిటీ లేదా ఉన్నత విద్యా సంస్థలో చదువు పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు కనీసం రెండేళ్ల గ్లోబల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. వివిధ విద్యా నేపథ్యాలు, నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని పరిశీలించవచ్చు. టెక్నాలజీ, డిజిటల్, బిజినెస్, స్ట్రాటజీ, వెల్త్ మేనేజ్‌మెంట్, గవర్నెన్స్ తదితర రంగాల్లో నైపుణ్యం ఉన్నవారికి అవకాశాలు...