ఏపీలో 913 ఆశా కార్యకర్తల పోస్టులు.. 10వ తరగతి అర్హతతో అవకాశం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 913 ఆశా కార్యకర్తల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ నియామక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ముఖ్య అర్హతలు విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణత వయసు: 25 నుంచి 45 ఏళ్లు అభ్యర్థులు: సంబంధిత గ్రామం/వార్డుకు చెందిన స్థానిక మహిళలు గౌరవ వేతనం: నెలకు రూ.10,000 జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన పనిచేసే జిల్లా ఆరోగ్య సొసైటీల ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు. స్థానిక మహిళలకు ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 1,294 ఆశా...