బ్యాటరీ రంగం విస్తరణ.. దేశంలో 20 లక్షల ఉద్యోగాలకు అవకాశం
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుండటంతో బ్యాటరీ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. ఈ రంగంలో పెట్టుబడులు, తయారీ సామర్థ్యం పెరగడంతో రాబోయే సంవత్సరాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది.2029–30 నాటికి భారత్లో బ్యాటరీ పరిశ్రమ ద్వారా 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉద్యోగాలు అందుబాటులోకి రావచ్చని అంచనా. బ్యాటరీ తయారీతో పాటు సరఫరా, నాణ్యత నియంత్రణ, నిర్వహణ, రీసైక్లింగ్ వంటి అనుబంధ విభాగాల్లోనూ ఉద్యోగాలు పెరగనున్నాయి.ప్రస్తుతం దేశంలో బ్యాటరీ సెల్స్ తయారీ నుంచి బ్యాటరీ ప్యాక్ తయారీ, రీసైక్లింగ్ వరకు పూర్తి స్థాయి పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. దీంతో వివిధ విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలు ఉన్న వారికి అవకాశాలు లభించనున్నాయి....