పశు ఔషధ బ్యాంకుకు ఔషధ విరాళం:
చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి దాతృత్వం అభినందనీయం: డా. పి. పెంటయ్య సూర్యాపేట సెప్టెంబర్ 08:కోదాడ పట్టణ ప్రాంతీయ పశువైద్యశాలలో నిర్వహిస్తున్న పశు ఔషధ బ్యాంకుకు తొమ్మిదవ విడతగా రూ.5 వేల విలువైన పశు ఔషధాలను నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, శ్రీ సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ జిల్లా సభ్యులు చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి విరాళంగా మంగళవారం అందించారు.ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య మాట్లాడుతూ.. గత తొమ్మిది నెలలుగా ప్రతి నెలా రూ.5 వేల విలువైన పశు ఔషధాలను విరాళంగా అందిస్తూ నోరులేని మూగజీవాల ప్రాణ రక్షణకు నిరంతరం కృషి చేస్తున్న చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి దాతృత్వం అభినందనీయమన్నారు. మూగజీవాల పట్ల ఆయన చూపుతున్న సేవాభావం...