మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాష్టీకం హేయమైన చర్య..
సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి! కోదాడలో భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు.. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం _ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సూర్యాపేట, సెప్టెంబర్ 8 :తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా, కాంగ్రెస్ ప్రభుత్వ కనుసన్నల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మహిళా శాసనసభ్యులపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తూ కోదాడలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ఎండగడుతూ కోదాడ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ నిరసన మరియు ధర్నా కార్యక్రమం చేపట్టారు.ఈ నిరసనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ...