రేవంత్ రెడ్డిది హిట్లర్ తరహా నియంతృత్వ పాలన
ముఖ్యమంత్రిని తక్షణమే భర్తరఫ్ చేయాలి అడుగడుగున ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారనే భయంతోనే బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ పార్టీ ఎండగడుతూనే ఉంటుంది _ కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ సూర్యాపేట సెప్టెంబర్ 09 :కోదాడ పట్టణంలోని మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ప్రజా సమస్యలపై (రైతులు, విద్యార్థులు, పారిశుద్ధ్యం తదితర...