సూపర్‌ ఇంటెలిజెన్స్‌తో మానవాళికి ముప్పు.. పరిశోధకుడి సంచలన హెచ్చరిక

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) భవిష్యత్తులో మానవాళికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని ఆంత్రోపిక్‌ సంస్థకు చెందిన పరిశోధకుడు జాకబ్‌ కాక్సన్‌ హెచ్చరించారు. ఈ కారణంగానే తాను ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. గతంలో ఓపెన్ఏఐలో పనిచేసిన కాక్సన్‌.. ప్రస్తుతం ఏఐ సంస్థలు స్వయంగా అభివృద్ధి చెందగల సూపర్‌ ఇంటెలిజెన్స్‌ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవస్థలు అదుపు తప్పితే కీలక సాంకేతిక వ్యవస్థలను ప్రభావితం చేయడంతో పాటు భారీ స్థాయిలో మానవాళికి నష్టం కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్ల విలువైన ఈక్విటీ వదులుకున్న పరిశోధకుడు ఆంత్రోపిక్‌లో తనకు లభించాల్సిన కంపెనీ ఈక్విటీని పొందడానికి రెండు నెలల ముందే...