పోలాల అమావాస్య.. సంతానం కోసం చేసే వ్రతం ఇదే!

శ్రావణ అమావాస్యను పలు ప్రాంతాల్లో పోలాల అమావాస్య, సంతాన అమావాస్యగా భావిస్తారు. ఈ రోజున మహిళలు అమ్మవారిని పూజించి, తమ పిల్లల ఆయురారోగ్యాలు, కుటుంబ సౌభాగ్యం కోసం ప్రత్యేక వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా వస్తోంది. 2026లో ఈ అమావాస్య సెప్టెంబర్ 11న వస్తోంది. పూజా విధానం అమావాస్య రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసి, పూజా మందిరంలో ముగ్గులు వేస్తారు. ఈ వ్రతంలో కంద మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. దానిని పూజా స్థలంలో ఉంచి పసుపు, కుంకుమ, బియ్యపు పిండితో అలంకరిస్తారు.ముందుగా పసుపుతో వినాయకుడిని పూజించి, అనంతరం కంద మొక్కలో మంగళగౌరీ లేదా సంతానలక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసుకుని సంప్రదాయం ప్రకారం పూజ నిర్వహిస్తారు....