డాక్టరేట్ సాధించిన శివకళ్యాణికి అభినందనలు

సూర్యపేట, సెప్టెంబర్ 10 : నిరుపేద కుటుంబం నుంచి ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ అవార్డు సాధించిన కాలతెరిపి శివకళ్యాణిని రామలక్ష్మీపురం గ్రామస్తులు అభినందించారు. గ్రామానికి చెందిన కౌలు రైతు కుటుంబం కాలతెరిపి పాపయ్య, అంజమ్మ దంపతుల కుమార్తె అయిన శివకళ్యాణి కోదాడలో డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., పీహెచ్‌డీ పూర్తి చేశారు. తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్ల చేతుల మీదుగా డాక్టరేట్‌ అవార్డు అందుకున్నారు.కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నెం పాపిరెడ్డి మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన శివకళ్యాణి పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్‌ సాధించడం అభినందనీయమన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని గ్రామంలోని విద్యార్థినీ విద్యార్థులు...