కాంగ్రెస్లో భారీ మార్పులు.. రాహుల్ కీలక భేటీలు
2029 లోక్సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్లో సంస్థాగత మార్పులకు అధిష్ఠానం సిద్ధమవుతోంది. ఏఐసీసీ జాతీయ కార్యదర్శుల ఎంపిక కోసం రాహుల్ గాంధీ స్వయంగా నేతలను ఇంటర్వ్యూ చేస్తున్నారు.దాదాపు 120 మంది నేతలతో ఈ ప్రక్రియ కొనసాగుతుండగా, ప్రస్తుత జాతీయ కార్యదర్శుల్లో 60 శాతానికి పైగా మార్పులు ఉండొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మరోవైపు ప్రియాంకా గాంధీకి ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మార్పుపైనా పార్టీలో చర్చ జరుగుతోంది.