మోదీజీ.. ఒక్క ఫొటో ప్లీజ్!

దిల్లీలో జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీని చూసిన పలువురు విదేశీ ప్రతినిధులు ఆయనతో ఫొటో దిగేందుకు ఆసక్తి చూపించారు. మోదీ చిరునవ్వుతో వారితో ఫొటోకు అంగీకరించారు. ఈ సమయంలో పుతిన్‌, ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ పక్కకు జరిగి దారి ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. https://twitter.com/i/status/2098442011963793589