తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు...
రైతాంగ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి... ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు... •జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సూర్యాపేట, సెప్టెంబర్ 12 :అనంతగిరి మండలం శాంతినగర్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్థూపాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా •జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,భూస్వామ్య, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతులు సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. రైతులు, కూలీలు, పేదల సమస్యలపై నిరంతరం పోరాడాలని అన్నారు. నేటి తరానికి రైతాంగ సాయుధ పోరాట చరిత్ర, అమరవీరుల త్యాగాలను వివరించాల్సిన...