మోదీ–పుతిన్–జిన్పింగ్.. ఒకే ఫ్రేమ్లో!
ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో మోదీ, పుతిన్, జిన్పింగ్ కలిసి కనిపించిన దృశ్యం వైరల్గా మారింది. ముగ్గురు నేతలు చేతులు కలిపిన ఫొటోను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏడేళ్ల తర్వాత జిన్పింగ్ భారత్కు రావడం ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. ఇదే సదస్సులో బ్రిక్స్ దేశాలు ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను ఆమోదించాయి. గ్లోబల్ సౌత్ దేశాల పాత్ర మరింత పెరగాలని మోదీ పిలుపునిచ్చారు.