అమీనాబాద్ బీసీ కమ్యూనిటీ హాల్ కు స్థలం సేకరణ.....
8 కుంటల ప్రభుత్వ స్థలాన్ని పంచాయతీ రాజ్ డీఈ కి అప్పగించిన రెవిన్యూ అధికారులు సూర్యాపేట, సెప్టెంబర్ 12: మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామ పంచాయతీ ప్రత్యేక సమావేశంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తీర్మానం ఆమోదం పొందింది.తీర్మానం అనంతరం గ్రామంలోని 8 కుంటల ప్రభుత్వ స్థలాన్ని బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు ఆర్ఐ వెంకటనగేష్ హద్దులు కేటాయించి, పంచాయతీ రాజ్ డీఈ సాయిరాం కు అధికారికంగా అప్పగించారు.గ్రామస్తుల సహకారంతో స్థలాన్ని పరిశీలించి హద్దులు నిర్ణయించి అప్పగింత ప్రక్రియ పూర్తి చేశారు.అనంతరం పంచాయతీ రాజ్ డీఈ సాయిరాం మాట్లాడుతూ.. త్వరలోనే ఈ స్థలంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ప్రారంభించి...