వెంకీ–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’.. నవ్వుల మధ్య థ్రిల్లింగ్ ట్విస్ట్!

విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా టీజర్ విడుదలైంది. వెంకటేశ్ తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకోగా.. టీజర్‌ మొత్తం వినోదభరితంగా సాగింది. మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక సమస్యలను సరదాగా చూపించారు.కుటుంబం ‘AK 47’ పేరున్న డ్యూప్లెక్స్ ఇంట్లోకి వెళ్లిన తర్వాత కథలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. ఓ క్రైమ్ ఘటన, విలన్ ఎంట్రీతో టీజర్ ఒక్కసారిగా సీరియస్ మోడ్‌లోకి మారుతుంది. దీంతో సినిమాలో కామెడీతో పాటు సస్పెన్స్, క్రైమ్, ఎమోషన్ కూడా ఉంటాయని టీజర్ స్పష్టం చేసింది.వెంకటేశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. నారా రోహిత్, దివ్యేందు శర్మ, నివేదా పేతురాజ్,...