బీఎంఎస్‌ బలోపేతంలో కార్యకర్తలు భాగస్వాములు కావాలి.....రాష్ట్ర సంఘటన కార్యదర్శి రామ్మోహన్‌

బీఎంఎస్‌ జిల్లా కో కన్వీనర్ గా మండవ మధు సూర్యాపేట, సెప్టెంబర్ 13 : భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌) బలోపేతంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని బీఎంఎస్‌ రాష్ట్ర సంఘటన కార్యదర్శి రామ్మోహన్‌ పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడ పట్టణంలో జిల్లా కన్వీనర్‌ అనంతుల సతీష్‌ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం బీఎంఎస్‌ నిరంతరం పోరాడుతోందన్నారు. కార్మికులు లేనిదే ఏ వ్యవస్థ ముందుకు సాగదని, దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్మికులు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.అనంతరం సూర్యాపేట జిల్లా కో-కన్వీనర్‌గా కోదాడకు చెందిన మండవ మధును, కోదాడ ట్రావెల్స్‌...