మెగా డీఎస్సీపై జగన్ ఫైర్.. పోస్టింగ్‌పై ప్రశ్నల వర్షం!

మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ అధినేత జగన్ మరోసారి ఆరోపణలు చేశారు. ఓ అభ్యర్థికి 65 టెట్ మార్కులతో ఉద్యోగం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఆ తర్వాత 77 మార్కులు ఉన్నట్లు అధికారులు చెప్పడంపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. ఎస్‌జీటీ పోస్టుకు సరిపోని టెట్ పేపర్‌తో అర్హత ఎలా కల్పించారని నిలదీశారు. నియామక ప్రక్రియపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఈ వ్యవహారానికి సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని జగన్ కోరారు.