మంత్రి పదవి పోయిందని బాధ లేదు.. కారణం చెప్పకపోవడమే బాధ: సురేఖ

కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని మాజీ మంత్రి కొండా సురేఖ ఖండించారు. తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని, భవిష్యత్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ టికెట్‌పైనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి పదవి కోల్పోవడంపై బాధ లేదని.. తనను ఎందుకు తొలగించారో కారణం చెప్పకపోవడమే ఆవేదన కలిగించిందన్నారు. త్వరలో తన భర్త కొండా మురళికి పదవి వచ్చే అవకాశం ఉందని సంకేతాలు వచ్చాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి గెలిచి మళ్లీ మంత్రి అవుతానని ధీమా వ్యక్తం చేశారు.