IIT హైదరాబాద్‌లో ఉద్యోగం.. ఇంటర్వ్యూతో ఎంపిక!

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Hyderabad)లో రీసెర్చ్ అసోసియేట్–I పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. థియరెటికల్ కండెన్స్డ్ మేటర్ ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో అర్హత ఉండాలి. అభ్యర్థులను ముందుగా షార్ట్‌లిస్ట్ చేసి, అనంతరం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 22లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.iith.ac.inను సందర్శించండి.