మరో 18 స్థానాలకు కవిత ఇన్చార్జులు
తెలంగాణ రక్షణ సేనను బలోపేతం చేసే దిశగా కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట్రంలోని మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జులను ప్రకటించారు. తాజా నియామకాలతో ఇప్పటివరకు 60 నియోజకవర్గాలకు బాధ్యులను నియమించినట్లు తెలిపారు. జిల్లాల అధ్యక్షులతో పాటు పార్టీ అనుబంధ విభాగాలకు కూడా కొత్త బాధ్యతలు అప్పగించారు. మెదక్ లోక్సభ స్థానానికి సైతం పార్టీ అధ్యక్షుడిని ప్రకటించారు.