ప్రజా సేవలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆశయాలు ఆదర్శం

తుంగతుర్తి: ఐదుసార్లు శాసనసభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన దివంగత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి సేవలు తెలంగాణ రాజకీయాల్లో చిరస్మరణీయమని తుంగతుర్తి నియోజకవర్గ టీపీసీసీ సోషల్ మీడియా ప్రతినిధి మూడ్ మోహన్ నాయక్ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా దామోదర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాజకీయ జీవితాన్ని కొనసాగించిన దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారని మోహన్ నాయక్ పేర్కొన్నారు. రైతుల సమస్యలు, సాగునీటి అవసరాలపై ఆయన నిరంతరం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. ముఖ్యంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని నల్గొండ...