హైదరాబాద్లో రౌడీషీటర్ దారుణ హత్య
హైదరాబాద్: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్నగర్ చౌరస్తా సమీపంలో రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలు, సెటిల్మెంట్లకు సంబంధించిన డబ్బుల వ్యవహారమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుంచి స్నేహితులుగా ఉన్నట్లు సమాచారం. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. గత మూడు నెలలుగా సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బుల విషయంలో వివాదం కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. బండ్లగూడ సహభావన అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న నహీమ్పై మహేష్ తన అనుచరులతో కలిసి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ...