మట్టి గణపతిని ఏర్పాటు చేయడం అభినందనీయం: డాక్టర్ కరుణశ్రీ
సూర్యాపేట సెప్టెంబర్ 15 :కోదాడ మున్సిపాలిటీ 30వ వార్డులో శ్రీరామ గణేష్ యూత్ ఆధ్వర్యంలో 11 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని డాక్టర్ కరుణశ్రీ అన్నారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన గణనాథుడి ఊరేగింపులో ఆమె పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కరుణశ్రీ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాల ఏర్పాటును ప్రోత్సహించాలని కోరారు. మట్టి గణపతి విగ్రహాల వల్ల చెరువులు, కాలుష్యానికి గురికాకుండా ఉంటాయని, ప్రజల్లో పర్యావరణంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.శ్రీరామ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించాలని...