రూ.10 వేల UPI పేమెంట్ చేస్తే.. రూ.40 ఛార్జీనా?
రూ.2 వేలకు మించిన UPI లావాదేవీలపై 40 బేసిస్ పాయింట్ల MDR నిర్ణయించినట్లు సమాచారం. అంటే రూ.100కు 40 పైసల చొప్పున లెక్కిస్తే.. రూ.10 వేల చెల్లింపుపై రూ.40 అవుతుంది. అయితే ఈ మొత్తాన్ని నేరుగా కస్టమర్ల నుంచి వసూలు చేస్తారా? లేదా వ్యాపారులే భరిస్తారా? అనేది సంబంధిత బ్యాంకులు, పేమెంట్ సంస్థల విధానాలపై ఆధారపడి ఉంటుంది. రూ.2 వేల వరకు UPI చెల్లింపులకు ఛార్జీ ఉండదని ప్రభుత్వం చెబుతోంది.