ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఖమ్మం, సెప్టెంబర్- 16: త్రైమాసిక తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవిఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, రాజకీయ ప్రతినిధులతో కలిసి బుధవారం తనిఖీ చేశారు. ముందుగా ఈవిఎం గోడౌన్ సీల్ ను పరిశీలించి రాజకీయ ప్రతినిధులు, అధికారుల సమక్షంలో సీల్ తీసి లోపలికి వెళ్లి, ఈ.వి.ఎం., వి.వి.ప్యాట్లు ఉన్న గది లోపల పరిశీలన చేసి తిరిగి సీల్ వేయించారు. తనిఖీ రిజిస్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. అలారం, ఫైర్ సేఫ్టీ పరికరాలు పరిశీలించారు. సీసీ కెమెరాల పని తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీ సిబ్బందికి తెలిపారు....