ప్రజా ఉద్యమమే నాణ్యమైన విద్య కు పునాది
రౌండ్ టేబుల్ సమావేశం లో మాజీ తెలంగాణా విద్యా కమీషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఖమ్మం ప్రతినిధి: సెప్టెంబర్, 16: ఖమ్మం : ప్రజలకు నాణ్యమైన విద్య లభించాలంటే రాజకీయ వ్యవస్థ పై ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలంగాణా మాజీ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు . ప్రజల నుండి డిమాండ్ లేకుండా ఏ పాలకవర్గం విద్యా వ్యవస్థను సరిదిద్దుతుందని భావించలేము , ఆశించడం కూడా పొరపాటు అవుతుందని అన్నారు . బుదవారం ఉదయం ఖమ్మం మయూరి సెంటర్ లోని శ్రీధర హోటల్ లో విద్యాబిమానులు , ఉపాద్యాయ , విద్యార్థి సంఘాలు , విద్యార్థుల తల్లిదండ్రులు , సామాజిక కార్యకర్త...