ప్రచారక్ నుంచి ప్రధాని వరకు.. మోదీ ప్రస్థానం

ప్రధాని నరేంద్ర మోదీ నేడు 76వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో జన్మించిన మోదీ.. ఆరెస్సెస్ ప్రచారక్‌గా తన ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం బీజేపీలో కీలక బాధ్యతలు చేపట్టి గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, 2019లో రెండోసారి, 2024లో మూడోసారి ప్రధాని అయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.