తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే:

సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ సూర్యాపేట, సెప్టెంబర్ 17:తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ–ముస్లింల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరిస్తూ బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు. గురువారం నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో అమరవీరుల స్థూపాల వద్ద విప్లవ వీరులకు జోహార్లు తెలియజేస్తూ బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూతెలంగాణ సాయుధ పోరాటం మతాల మధ్య జరిగిన ఘర్షణ కాదని, నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదలు సాగించిన మహత్తర ప్రజా పోరాటమని స్పష్టం చేశారు. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన ఈ పోరాటంలో హిందూ, ముస్లిం ప్రజలు కలిసి పాల్గొన్నారని...