అమరవీరులకు ఘన నివాళులు
బక్క హేమ్లాతండా, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బక్క హేమ్లాతండా గ్రామపంచాయతీ కేంద్రంలో అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. గ్రామ సర్పంచ్ గుగులోత్ కృష్ణ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా కృష్ణ నాయక్ మాట్లాడుతూ.. స్వేచ్ఛ కోసం పోరాడిన వీరుల త్యాగాలు, తెలంగాణ ప్రజల ఐక్యత, ధైర్యం, పోరాట స్ఫూర్తి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు. వారి ఆశయాలను, ప్రజాస్వామ్య విలువలను, సమానత్వ భావనను కొనసాగించడమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు తెలంగాణ పోరాట గాథలను తెలియజేస్తూ సమాజ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు...