పోలీసు ఉద్యోగాల పరీక్ష తేదీలు వచ్చేశాయ్!

హైదరాబాద్‌: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల రాత పరీక్షల తేదీలను పోలీస్‌ నియామక మండలి ప్రకటించింది. ఎస్‌ఐ పోస్టులకు నవంబర్‌ 29న, కానిస్టేబుల్‌ పోస్టులకు డిసెంబర్‌ 20న రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.పోలీస్‌, ఎస్‌పీఎఫ్‌, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 5,77,064 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎస్‌ఐ పోస్టులకు 1,60,756 మంది, కానిస్టేబుల్‌ పోస్టులకు 3,89,356 మంది దరఖాస్తు చేసినట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్‌ వి.వి. శ్రీనివాసరావు తెలిపారు.